Tuesday, January 02, 2024

              వేణుగోపాల్ టాకీస్ (1960 - 2022 )

                                                                        -- శ్రీనివాస్ రావు దేవభక్తుని (డీ.జి శ్రీనివాస్)

 

వేణుగోపాల్ థియేటర్ నేలమట్టం తో మన అందరి సమిష్టి జ్ఞాపకం బౌతికంగా దూరం అయ్యింది.సినీమా విక్షణ  స్వర్ణయుగ అస్తమయం తరువాత జరుగుతన్న పరిణామ క్రమం ఇది.

 

అసలు వేణుగోపాల్ థియేటర్ అంటే అనే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ వచ్చేయి 1988 వరకు,లేకుంట ప్లాప్ సినిమాలుఅందుకని  హాల్ కి వెళ్ళింది తక్కువే.

 

అప్పట్లో భద్రాచలం  సిమెంట్ రోడ్ చాల ఎత్తులో ఉండేది థియేటర్ కి వెల్లాలి అంటే లోయలోకి ప్రయాణమే.మళ్లీ హాల్ లో కి వెళ్ళాలి అంటే చాల ఎత్తైన మెట్లు ఎక్కాలి.

 

అది  ఆట(షోఅయినా , పాల్వంచ లో ఎక్కడ ఉన్న ,తొంబ్బాయి శాతం మంది  సినిమాకు నడిచే వెళ్లే వారు.సినిమా విడిచిపెడితే తండోపు తండాలు గా జనం.

 

పూర్వీకుల మాటలో ,థియేటర్ లో వేసే పాటల  రికార్డ్స్ ఊరంతా వినపడేవి అని,ఆడ వాళ్ళు అందరు ఒక వైపు మాగ వారందరు ఒక వైపు కుర్చేనవారు అని చెప్పవాళ్లు.

 

1980 కు ముందు పావలా టికెట్ కూడా ఉండేదిట,నా ఎరుక  వరకు అరవై  పైసలురూపాయి ఇరవై పైసలు ,రెండు రూపాయలు ముప్పై పైసలు టికెట్ రేట్లు 1989 వరకు ఉండేవి.

 

సినిమా టికెట్ దొరకాలంటే దొమ్ములాట ,బాహాబాహీ జరగలసిందే ,మ్యాటినీ కి వెళ్లి వస్తే

బట్టలు  పొగ వాసనా పట్టి వుండాయిమనం సినిమాకెళ్ళాం అని చెప్పకనే చెప్పాయి.

 

జనం ఎక్కువైతే ఎక్సట్రా చెక్క  బల్లలు ,నల్లుల బాధషో మధ్య లో కరెంటు పోవటాలు ఏమాత్రం మన లోని సినిమా మీద మన అనురక్తిని తగ్గించేవి కావు.

 

వేణుగోపాల్ థియేటర్ లో సినిమా చూడాలంటే మొదటి ఆట (ఫస్ట్ షోలేదా రెండవ ఆటలు   బెస్ట్ , ఎందుకంటే తలుపులన్నీ తెరిచేవారు ,బయట వున్నా పొడుగాటి అశోక చెట్ల గాలి అద్భుతంగా ఉండేదిఅటువంటి వాతావరణం లో  మాయాబజార్మిస్సమ్మ ,సువర్ణసుందరి లాంటి క్లాసిక్ సినిమాలు చూడటం వేరే తరహా అనుభూతి మధ్య లో జంతికలు అమ్మడానికి వచ్చేయి ,వాటి రుచి వేరే నేను చెప్పా అవసరం లేదు.

 

గూఢచారి నెంబర్ 1  ( హలో మూడు వారలు నడించింది)  ,ప్రేమసాగరంజంతుప్రపంచంముగ్గురి మిత్రులు , అర్ధరాత్రి స్వతంత్రంషరాబీ,  మరియు విజయ వారి క్లాసిక్స్  హాలులో నేను చూసిన మంచి చిత్ర'రాజాలు'.

 

1990 తరవాత హాల్ రేనోవేషన్ జరిగిందిచాలాకాలం తరువాత రోబో (2010 )  హాలు లో మా పిల్లలు తో చూడం జరిగిందికానీ నేను చివరిగా చుసిన సినిమా గోపాల గోపాల .

 

వేణుగోపాల్ థియేటర్ అంటే ఇంకా బాగా గుర్తుండేవి బయట హాలు పైన  కృష్ణుడు బొమ్మ ,ప్రారంభోత్సవ నల్ల గ్రానైట్ పాలకథియేటర్ కొలిచిన  రెండు జ్ఞాపకాలు సజీవంగా ఉంటె బావుండేది.

 

ముక్తాయింపు:

 

పక్కనే వున్నా వెంకటేశ్వర లో 'అనిమల్అనే సినిమాకు  నేను వెళ్ళాను (Dec  23  లో ) టికెట్ రేటు అక్షరాలా నూట పది రూపాయలు  ,యధావిధిగా  బొమ్మ సరిగా కనపడలేదుమాట సారిగా వినపడలేదు,దోమలబాధ , కానీ నా  సినీఅభిరుచి మాత్రం ఏమాత్రం తగ్గలేదు

 

థియేటర్ చిత్రమాలికఅందులో వేణుగోపాలుడ్ని

గమనించ వచ్చు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  

Dorababu ( దొరబాబు)

                                                              ****2023 November****


ఈ సారి  ఇండియా ట్రిప్ లో  భద్రాద్రి రాముడి దర్శనం నా బకెట్  లిస్ట్ లో ఒక ప్రధాన కోరిక , అ మనసులో ని మాటని మార్నింగ్ వాక్ లో  నా ప్రవాస బాల్యమిత్రుడు తో  వారం క్రితం బయట పెట్టగానే, చేద్దాం చూద్దాం అన్నాడు. 


హఠాత్తుగా నిన్న నా ప్రవాస మిత్రుడు, రెడీ గా వుండు నీకు సాయంత్రం భద్రాచలం లో  దర్శనం కోరిక నెరవేరబోతోంది అన్నాడు, అలాగానే ఒక పెళ్ళికి అక్షింతలు వేసి వస్తాం అన్నాడు.నేను సరే అనేశాను.


                            ****************** 1984-89**************

 మా నాయనమ్మ అరేయ్ శీను దొరబాబు ఎదో ట్యూషన్ సెంటర్ పెడుతున్నాడు ,నువ్వు జాయిన్ అయిపో అంది ,ఎదురు చెప్పే  అవకాశం మనకు ఎలాగూ ఉండదు గనుక ,ఒకే అని తల ఊపి నా  గౌరవాన్ని కాపాడుకున్నాను.అదే అదే ఆఫర్ నా చాలా మంది స్నేహితులకు వచ్చింది.


అ ట్యూషన్ సెంటర్ ,ఎప్పటిలాగా  'నారాయణపరాయణ' రుబ్బుడు సెంటర్ లాంటిది కాదు, అక్కడ  మాకు సైన్స్   రాళ్లబండి కవితాప్రసాద్ , లెక్కలుకి ఉపేంద్ర సర్ మరియు జగన్మోహనరావు అని ఒక KTPS ఉద్యోగి  , ఇంగ్లీష్  కమల్  (కామాలుద్దీన్)  క్లాసులు తీసుకునేవారు.


అ  ట్యూషన్ సెంటర్ పేరు 'నవతా ట్యుటోరియల్స్' .

కాలక్రమేణా అది 'నవతా స్కూల్' గా రూపాంతరం చెందింది.

పాల్వంచ పట్నం లో ఒక విద్యవిప్లవం  (1984-90)  తీసుకుకొని వచ్చింది అని చెప్పటం లో సందేహం ఏమాత్రం లేదు.


అ ట్యూషన్ సెంటర్ పెట్టిన దొరబాబు అని మేము పిలుచుకునే వ్యక్తి       'ప్రభు కుమార్'.


తర్వాతి రోజుల్లో రాళ్లబండి కవితాప్రసాద్ చేత పాల్వంచ ప్రజలకు అవధానప్రక్రియ ని పరిచయం చేసాడు, కవిసమ్మేలేళ్ళకు కొదవే లేదు.


ట్యూషన్ సెంటర్ తో సరిపెట్టకుండా క్రికెట్ టౌర్నమెంట్స్ ,స్పోర్ట్స్ క్యాంప్స్ పెట్టి ఎంతో మందికి  స్పోర్ట్స్ పరిచయం చేసాడు అనటం లో ఏమాత్రం సందేహం లేదు.


'HINDUSTAN KI KASAM'  అనే ఒక దేశభక్తి సినిమా బెన్ఫిట్ షో  వేసి పాల్వంచ క్రికెట్ క్లబ్ అంకురార్పణ చేసాడు.


షణ్ముఖ శ్రీనివాస్  అనే అప్పటి ప్రఖ్యాత కళాకారుడి తో  సాంప్రదాయ నృత్య ప్రదర్శన ,పాల్వంచ జనాలకు రుచి చూపించాడు.


ఒక దశ లో ఒక లోకల్ MLA  కు వుండే  Reach and Respect  (గోరువమర్యాదలు) ఉండేవి.

 

మా తరం పిల్లకాయలు అందరికి దశ-దిశా నిరాధేశ్యాం చేసిన ఒక నొక శక్తి  'ప్రభుకుమార్' అనటం లో అతియోశక్తి  ఏమాత్రం లేదు.


                                    ******2023 డిసెంబర్ 6  సాయంత్రం *****


రాముడి దర్శన అంతరం ,అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి మంటపానికి వెళ్లి అక్షింతలు వేసేఅందుకు లైన్ లో నిల్చొని   యధాలాపనగా పెళ్లి ఎవరది అని నా ఇంకో పుర ప్రముఖ మిత్రుడుని అడిగా. 

 

  అరేయ్ ఇ పెళ్ళికొడుకు మన ప్రభుకుమార్  గారి అబ్బాయి రా  అన్నాడు.


అక్షింతలు వేస్తూ ఆ పెళ్ళికొడుకు మేము మీ నాన్న గారి పూర్వ పాత విద్యార్థులు అని గొంతు అడ్డుపడుతుంటే ,ఎమోషన్ ని కంట్రోల్ చేస్కుంటూ  విషెస్ చెప్పి  బయటకు వచ్చాను.