Showing posts with label Khammam. Show all posts
Showing posts with label Khammam. Show all posts

Tuesday, January 02, 2024

Dorababu ( దొరబాబు)

                                                              ****2023 November****


ఈ సారి  ఇండియా ట్రిప్ లో  భద్రాద్రి రాముడి దర్శనం నా బకెట్  లిస్ట్ లో ఒక ప్రధాన కోరిక , అ మనసులో ని మాటని మార్నింగ్ వాక్ లో  నా ప్రవాస బాల్యమిత్రుడు తో  వారం క్రితం బయట పెట్టగానే, చేద్దాం చూద్దాం అన్నాడు. 


హఠాత్తుగా నిన్న నా ప్రవాస మిత్రుడు, రెడీ గా వుండు నీకు సాయంత్రం భద్రాచలం లో  దర్శనం కోరిక నెరవేరబోతోంది అన్నాడు, అలాగానే ఒక పెళ్ళికి అక్షింతలు వేసి వస్తాం అన్నాడు.నేను సరే అనేశాను.


                            ****************** 1984-89**************

 మా నాయనమ్మ అరేయ్ శీను దొరబాబు ఎదో ట్యూషన్ సెంటర్ పెడుతున్నాడు ,నువ్వు జాయిన్ అయిపో అంది ,ఎదురు చెప్పే  అవకాశం మనకు ఎలాగూ ఉండదు గనుక ,ఒకే అని తల ఊపి నా  గౌరవాన్ని కాపాడుకున్నాను.అదే అదే ఆఫర్ నా చాలా మంది స్నేహితులకు వచ్చింది.


అ ట్యూషన్ సెంటర్ ,ఎప్పటిలాగా  'నారాయణపరాయణ' రుబ్బుడు సెంటర్ లాంటిది కాదు, అక్కడ  మాకు సైన్స్   రాళ్లబండి కవితాప్రసాద్ , లెక్కలుకి ఉపేంద్ర సర్ మరియు జగన్మోహనరావు అని ఒక KTPS ఉద్యోగి  , ఇంగ్లీష్  కమల్  (కామాలుద్దీన్)  క్లాసులు తీసుకునేవారు.


అ  ట్యూషన్ సెంటర్ పేరు 'నవతా ట్యుటోరియల్స్' .

కాలక్రమేణా అది 'నవతా స్కూల్' గా రూపాంతరం చెందింది.

పాల్వంచ పట్నం లో ఒక విద్యవిప్లవం  (1984-90)  తీసుకుకొని వచ్చింది అని చెప్పటం లో సందేహం ఏమాత్రం లేదు.


అ ట్యూషన్ సెంటర్ పెట్టిన దొరబాబు అని మేము పిలుచుకునే వ్యక్తి       'ప్రభు కుమార్'.


తర్వాతి రోజుల్లో రాళ్లబండి కవితాప్రసాద్ చేత పాల్వంచ ప్రజలకు అవధానప్రక్రియ ని పరిచయం చేసాడు, కవిసమ్మేలేళ్ళకు కొదవే లేదు.


ట్యూషన్ సెంటర్ తో సరిపెట్టకుండా క్రికెట్ టౌర్నమెంట్స్ ,స్పోర్ట్స్ క్యాంప్స్ పెట్టి ఎంతో మందికి  స్పోర్ట్స్ పరిచయం చేసాడు అనటం లో ఏమాత్రం సందేహం లేదు.


'HINDUSTAN KI KASAM'  అనే ఒక దేశభక్తి సినిమా బెన్ఫిట్ షో  వేసి పాల్వంచ క్రికెట్ క్లబ్ అంకురార్పణ చేసాడు.


షణ్ముఖ శ్రీనివాస్  అనే అప్పటి ప్రఖ్యాత కళాకారుడి తో  సాంప్రదాయ నృత్య ప్రదర్శన ,పాల్వంచ జనాలకు రుచి చూపించాడు.


ఒక దశ లో ఒక లోకల్ MLA  కు వుండే  Reach and Respect  (గోరువమర్యాదలు) ఉండేవి.

 

మా తరం పిల్లకాయలు అందరికి దశ-దిశా నిరాధేశ్యాం చేసిన ఒక నొక శక్తి  'ప్రభుకుమార్' అనటం లో అతియోశక్తి  ఏమాత్రం లేదు.


                                    ******2023 డిసెంబర్ 6  సాయంత్రం *****


రాముడి దర్శన అంతరం ,అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి మంటపానికి వెళ్లి అక్షింతలు వేసేఅందుకు లైన్ లో నిల్చొని   యధాలాపనగా పెళ్లి ఎవరది అని నా ఇంకో పుర ప్రముఖ మిత్రుడుని అడిగా. 

 

  అరేయ్ ఇ పెళ్ళికొడుకు మన ప్రభుకుమార్  గారి అబ్బాయి రా  అన్నాడు.


అక్షింతలు వేస్తూ ఆ పెళ్ళికొడుకు మేము మీ నాన్న గారి పూర్వ పాత విద్యార్థులు అని గొంతు అడ్డుపడుతుంటే ,ఎమోషన్ ని కంట్రోల్ చేస్కుంటూ  విషెస్ చెప్పి  బయటకు వచ్చాను.