వేణుగోపాల్ టాకీస్ (1960 - 2022 )
వేణుగోపాల్ థియేటర్ నేలమట్టం తో మన అందరి సమిష్టి జ్ఞాపకం బౌతికంగా దూరం అయ్యింది.సినీమా విక్షణ స్వర్ణయుగ అస్తమయం తరువాత జరుగుతన్న పరిణామ క్రమం ఇది.
అసలు వేణుగోపాల్ థియేటర్ అంటే అనే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ వచ్చేయి 1988 వరకు,లేకుంట ప్లాప్ సినిమాలు, అందుకని ఈ హాల్ కి వెళ్ళింది తక్కువే.
అప్పట్లో భద్రాచలం సిమెంట్ రోడ్ చాల ఎత్తులో ఉండేది, ఈ థియేటర్ కి వెల్లాలి అంటే లోయలోకి ప్రయాణమే.మళ్లీ హాల్ లో కి వెళ్ళాలి అంటే చాల ఎత్తైన మెట్లు ఎక్కాలి.
అది ఎ ఆట(షో) అయినా , పాల్వంచ లో ఎక్కడ ఉన్న ,తొంబ్బాయి శాతం మంది సినిమాకు నడిచే వెళ్లే వారు.సినిమా విడిచిపెడితే తండోపు తండాలు గా జనం.
పూర్వీకుల మాటలో ,థియేటర్ లో వేసే పాటల రికార్డ్స్ ఊరంతా వినపడేవి అని,ఆడ వాళ్ళు అందరు ఒక వైపు మాగ వారందరు ఒక వైపు కుర్చేనవారు అని చెప్పవాళ్లు.
1980 కు ముందు పావలా టికెట్ కూడా ఉండేదిట,నా ఎరుక వరకు అరవై పైసలు, రూపాయి ఇరవై పైసలు ,రెండు రూపాయలు ముప్పై పైసలు టికెట్ రేట్లు 1989 వరకు ఉండేవి.
సినిమా టికెట్ దొరకాలంటే దొమ్ములాట ,బాహాబాహీ జరగలసిందే ,మ్యాటినీ కి వెళ్లి వస్తే
బట్టలు పొగ వాసనా పట్టి వుండాయి, మనం సినిమాకెళ్ళాం అని చెప్పకనే చెప్పాయి.
జనం ఎక్కువైతే ఎక్సట్రా చెక్క బల్లలు ,నల్లుల బాధ, షో మధ్య లో కరెంటు పోవటాలు ఏమాత్రం మన లోని సినిమా మీద మన అనురక్తిని తగ్గించేవి కావు.
వేణుగోపాల్ థియేటర్ లో సినిమా చూడాలంటే మొదటి ఆట (ఫస్ట్ షో) లేదా రెండవ ఆటలు బెస్ట్ , ఎందుకంటే తలుపులన్నీ తెరిచేవారు ,బయట వున్నా పొడుగాటి అశోక చెట్ల గాలి అద్భుతంగా ఉండేది, అటువంటి వాతావరణం లో మాయాబజార్, మిస్సమ్మ ,సువర్ణసుందరి లాంటి క్లాసిక్ సినిమాలు చూడటం వేరే తరహా అనుభూతి. ఈ మధ్య లో జంతికలు అమ్మడానికి వచ్చేయి ,వాటి రుచి వేరే నేను చెప్పా అవసరం లేదు.
గూఢచారి నెంబర్ 1 (ఈ హలో మూడు వారలు నడించింది) ,ప్రేమసాగరం, జంతుప్రపంచం, ముగ్గురి మిత్రులు , అర్ధరాత్రి స్వతంత్రం, షరాబీ, మరియు విజయ వారి క్లాసిక్స్ ఈ హాలులో నేను చూసిన మంచి చిత్ర'రాజాలు'.
1990 తరవాత హాల్ రేనోవేషన్ జరిగింది, చాలాకాలం తరువాత రోబో (2010 ) ఈ హాలు లో మా పిల్లలు తో చూడం జరిగింది, కానీ నేను చివరిగా చుసిన సినిమా గోపాల గోపాల .
వేణుగోపాల్ థియేటర్ అంటే ఇంకా బాగా గుర్తుండేవి బయట హాలు పైన కృష్ణుడు బొమ్మ ,ప్రారంభోత్సవ నల్ల గ్రానైట్ పాలక, థియేటర్ కొలిచిన ఈ రెండు జ్ఞాపకాలు సజీవంగా ఉంటె బావుండేది.
ముక్తాయింపు:
పక్కనే వున్నా వెంకటేశ్వర లో 'అనిమల్' అనే సినిమాకు నేను వెళ్ళాను (Dec 23 లో ) టికెట్ రేటు అక్షరాలా నూట పది రూపాయలు ,యధావిధిగా బొమ్మ సరిగా కనపడలేదు, మాట సారిగా వినపడలేదు,దోమలబాధ , కానీ నా సినీఅభిరుచి మాత్రం ఏమాత్రం తగ్గలేదు
థియేటర్ చిత్రమాలిక, అందులో వేణుగోపాలుడ్ని
గమనించ వచ్చు.
No comments:
Post a Comment